ETV Bharat / city

ఎమ్మెల్యే బొల్లా తప్పుడు ప్రచారం మానుకోవాలి: జీవీ ఆంజనేయులు - guntur district news

వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.. తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని తెదేపా నేత జీవీ ఆంజనేయులు అన్నారు. వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని సవాల్​ విసిరారు.

tdp leader gv anjeneyulu
ఎమ్మెల్యే బొల్లా తప్పుడు ప్రచారం మానుకోవాలన్న జీవీ ఆంజనేయులు
author img

By

Published : May 31, 2021, 5:19 PM IST

తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తెదేపా నేత జీవీ ఆంజనేయులు.. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మండిపడ్డారు. దీనిపై ఆయన గుంటూరు జిల్లా నరసరావుపేటలో మీడియా సమావేశం నిర్వహించారు. తనపై చేసిన ఆరోపణలపై కోటప్పకొండలో సత్య ప్రమాణానికి పిలుపునిచ్చినా.. ఎమ్మెల్యే రాలేదని తెలిపారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని గతంలో త్రికోటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణం చేశానని జీవీ అన్నారు.

అభివృద్ధిపై చర్చకు రావాలంటూ సవాల్​..

కరోనా వైద్యం పేరుతో ఎమ్మెల్యే, వైద్యులు దోచుకుంటున్నారని జీవీ ఆరోపించారు. తప్పు చేయలేదని ప్రమాణం చేసేందుకు ఎమ్మెల్యే సిద్ధమా అంటూ సవాల్​ విసిరారు. తమ ఫౌండేషన్ సేవల నిలిపివేతపై నోటీసులు ఇచ్చిన అధికారులపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమన్న జీవీ.. వైకాపా చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చకు బొల్లా బ్రహ్మనాయుడు ముందుకు రావాలన్నారు.

ఇవీ చదవండి:

5జీ నెట్​వర్క్​​ వద్దంటూ హైకోర్టుకు ప్రముఖ నటి

'ఆయిల్‌ సంస్థల అత్యాశ.. వినియోగదారునిపై భారం పెరిగేందుకు కారణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.