Son killed mother: పేగు తెంచుకుని పుట్టిన బిడ్డే ఆ తల్లి పాలిట కాలయముడయ్యాడు. ఆస్తి కోసం కన్నతల్లినే హతమార్చాడు ఓ కొడుకు. ఈ హృదయవిదారక సంఘటన గుంటూరు జిల్లా నరసరావుపేటలో జరిగింది.
పట్టణంలోని వడ్డెర బజారులో నివాసముంటున్న బత్తుల శివమ్మకు ముగ్గురు కుమారులు. అందులో ఇద్దరు మరణించగా.. శివమ్మ భర్త గతేడాది కాలం చేశారు. పట్టణంలో శివమ్మకు ఉన్న ఇంట్లో ఒక పోర్షన్ అమ్మి.. ఉన్న ఒక్క కుమారుడు వెంకట్రావుకు రూ.15లక్షలు ఇచ్చింది. మిగిలిన రెండు పోర్షన్‌లలో.. ఓ ఇంట్లో తల్లి శివమ్మ, మరో ఇంట్లో కుమారుడు వెంకట్రావు ఉంటున్నారు.
Son killed mother: శివమ్మ వద్దకు సత్తెనపల్లిలో ఉంటున్న ఆమె సోదరి ఆదిలక్ష్మి వస్తుంటారు. ఈ క్రమంలో మిగిలిన ఆస్తిని ఎక్కడ తన సోదరికి ఇస్తుందోనని అనుమానంతో.. వెంకట్రావు తల్లితో తగాదా పెట్టుకుని.. కత్తితో పొడిచి చంపాడని సీఐ అశోక్ కుమార్ తెలిపారు. వెంకట్రావు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఆస్తి విషయంలో వెంకట్రావు.. చాలా ఏళ్లుగా తల్లితో తగాదా పడుతున్నట్లు మృతురాలి సోదరి ఆదిలక్ష్మి తెలిపింది.
ఇదీ చదవండి: కుళ్లిన కోడిగుడ్లు తిని 11 మంది విద్యార్థులకు అస్వస్థత