గుంటూరు నగరంలో ఇంజినీరింగ్ విద్యార్థిని రమ్య... ఉన్మాది చేతిలో హత్యకు గురైన ఘటనపై రాష్ట్ర భాజాపా అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యావత్తు దేశం స్వాత్రంత్ర దినోత్సవాల్లో ఉన్న సమయంలో ఇలాంటి ఘటన రాజధాని ప్రాంతమైన గుంటూరులో జరగడం శోచనీయమన్నారు. ఈ హత్యద్వారా రాష్ట్రంలో శాంతిభద్రతల పర్యవేక్షణ అధ్వానంగా ఉన్నట్లుగా కనపడుతోందని ఆందోళన చెందారు.
ఉన్మాదులు, అరాచక శక్తులకు చట్టాలపై భయం ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోతున్నయాని అన్నారు. రమ్య కుటుంబ సభ్యులను వెంటనే వెళ్లి కలసి, వివరాలు సేకరించాలని గుంటూరు పార్టీ నేతల్ని వీర్రాజు ఆదేశించారు. దోషిని వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలన్నారు. బాధితురాలి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వెంటనే ఇవ్వాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
రమ్య హత్య కేసు నిందితుడిని కఠినంగా శిక్షించాలి: సీపీఐ రామకృష్ణ