భర్త వేధింపులు తాళలేక సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన... తెలంగాణలోని హైదరాబాద్ రాయదుర్గం పీఎస్ పరిధిలో జరిగింది. గచ్చిబౌలి ఖాజాగూడలోని స్వరూప రెసిడెన్సీలో కృష్ణకిశోర్, హిరణ్మయి దంపతులు నివాసం ఉంటున్నారు. వీరు సాప్ట్వేర్ ఉద్యోగులు. గుంటూరు తెనాలి ప్రాంతానికి చెందిన హిరణ్మయి... గుంటూరుకు చెందిన కృష్ట కిశోర్‌ను వివాహం చేసుకుంది. కిశోర్ 'ఎల్ అండ్ టీ'లో ఉద్యోగం చేస్తుండగా...హిరణ్మయి విప్రోలో పని చేస్తుంది. భర్త వేధింపులు, కుటుంబ తగాదాల కారణంగానే హిరణ్మయి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం సీఐ రవీందర్ తెలిపారు.
ఇవీ చూడండి: 'ఐదేళ్లలో మీరేం చేశారు... అమరావతిలో ఇల్లు కూడా కట్టుకోలేదు'