మాజీ సభాపతి కోడెల శివప్రసాదరావు మరణంతో గుంటూరు జిల్లా నరసరరావుపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. వైద్యునిగా ప్రస్థానం ప్రారంభించి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కోడెలకు ఆయన సొంత నియోజకవర్గం నరసరావుపేటతో విడదీయరాని బంధం ఉంది. కోడెల మరణ వార్తతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రెవెన్యూ, పోలీసు అధికారులు నరసరావుపేటలో ముందస్తు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడకుండా నరసరావుపేటలో 144 సెక్షన్ విధించారు. ఈ నెల 30 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని డీఎస్పీ వీరారెడ్డి తెలిపారు. నలుగురికి మించి తిరగవద్దని ప్రజలకు డీఎస్పీ విజ్ఞప్తి చేశారు. నరసరావుపేట సబ్ డివిజన్ ప్రాంతంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :
'ప్రభుత్వ వేధింపులే.. కోడెల మరణానికి కారణం'