పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ 'రన్ ఫర్ యూనిటీ' కార్యక్రమాన్ని గుంటూరు పోలీసులు నిర్వహించారు. నగరంలోని హిందూ కళాశాల కూడలి నుంచి లాడ్జి సెంటర్ అంబేడ్కర్ కూడలి వరకు పాదయాత్ర చేపట్టారు. మానవహారంగా ఏర్పడి వారి సేవలకు నివాళులర్పించారు.
కరోనా నుంచి కోలుకుని.. విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని 'పోలీస్ వారియర్స్'గా గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి అభివర్ణించారు. ప్రజలందరూ సమానమనే భావన కలిగించడం కోసం ఈ కార్యక్రమం చేపట్టామని వెల్లడించారు. అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా.. అక్టోబర్ 21 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా రొజుకొక కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. విధి నిర్వహణలో అసువులు బాసిన సిబ్బంది పోరాట ప్రతిమకు గుర్తింపు ఇవ్వడం కోసమే ఈ ప్రయత్నమన్నారు.
ఇదీ చదవండి: