బాపూజీ స్ఫూర్తి బాట-రాజధాని పోరుబాట పేరుతో రైతులు 29 గ్రామాల్లో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. తుళ్లూరు, వెలగపూడి, మందడం, బోరుపాలెం, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఉద్దండరాయునిపాలెం, పెదపరిమి, అనంతవరం, నెక్కల్లులో రైతులు కాగడాల ర్యాలీ చేశారు. బాపూజీ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కృష్ణాయపాలెం, వెంకటపాలెం, పెదపరిమిలో రైతులు మానవహారం నిర్వహించారు. మందడం వీధుల్లో రైతులు మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.
ఇదీ చదవండి
ఎన్నిలకు సిద్ధంగా ఉండండి... పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు