'రాజధాని ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం' - ఏపీలో రాజధాని రగడ వార్తలు
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ ప్రజాసంఘాల ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో నిరసన చేపట్టారు. బృందావన్ గార్డెన్స్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు ర్యాలీ నిర్వహించారు. సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాజధాని పరిధిలోని ప్రజాప్రతినిధులు స్పందించకపోతే వాళ్ల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.
protest continue in guntoor over capital city issue
Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్
యాంకర్... అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ గుంటూరు లో నిరసన కార్యక్రమం చేపట్టారు. వాకర్స్, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గుంటూరు బృందావన్ గార్డన్స్ నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీ నిర్వహించారు. సేవ్ అమరావతి - సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. గత ప్రతిపక్ష నాయకుడు , ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమరావతిలొనే రాజధాని ఏర్పాటు చేయడానికి అంగీకరించి.... నేడు మాట తప్పి మడిమ తిప్పారని ఆరోపించారు. మూడు రోజులు ప్రతిపాదనను తక్షణమే ఉపసంహరించుకోవాలని... రాజధాని పై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Body:బైట్.... మన్నవ సుబ్బారావు, మిర్చియార్డు మాజీ చైర్మన్ బైట్.... మాధవి, స్థానికులు బైట్.... స్వర్ణకుమారి, స్థానికులు బైట్.... లాల్ వజీర్, వాకర్స్ అసోసియేషన్ అద్యక్షుడు