ఇసుక సరఫరా ఆరోపణలపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌కల్యాణ్‌ను ఇసుక ట్రాన్స్పోర్టర్లు కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. దీనిపై స్పందించిన జనసేనాని... పనుల్లేక లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు బాధపడుతున్నారన్నారు. వారిని ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం చేస్తామని వెల్లడించారు.
ఇవీ చదవండి..