NANDI: గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గంలోని దుండిపాలెంలో వింత చోటు చేసుకుంది. మల్లికార్జునస్వామి దేవస్థానంలోని నంది విగ్రహం పాలు తాగుతుందంటూ... భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. నందీశ్వరుని విగ్రహానికి పాలు అందిస్తూ హారతులు ఇచ్చారు.
నంది నోటి వద్ద పాలు పెట్టగానే... పాలు మాయమవడంతో నందీశ్వరుడు పాలు తాగుతున్నాడంటూ భక్తులు ప్రచారం చేశారు. ఈ విషయం తెలియడంతో సమీప గ్రామాల ప్రజలు నందికి పాలు పోయడానికి బారులు తీరారు. భక్తుల రాకతో గ్రామంలో కోలాహలం నెలకొంది. తమ గుడిలో ఇలాంటి అద్భుతం జరగడం చాలా ఆనందంగా ఉందని గ్రామస్థులు అంటున్నారు.
ఇదీ చదవండి:
ఉద్యోగాల భర్తీ ప్రతి ఏటా చేయాల్సిందే..: అశుతోష్ మిశ్ర కమిటీ