Mother and daughter died : ఇద్దరు ప్రయాణించాల్సిన ద్విచక్రవాహనంపై నలుగురు ప్రయాణించారు. ఫలితంగా జరిగిన ప్రమాదంలో భార్య, కుమార్తె మృతి చెందగా కుమారుడితో అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం కోండ్రుపాడు పరిధిలోని జాతీయ రహదారి పై ఈ ప్రమాదం జరిగింది. నలుగురు కుటుంబ సభ్యులతో ద్విచక్రవాహనంపై వస్తున్న వ్యక్తి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తల్లి, కూతురు మృతి చెందారు. తండ్రి, కొడుకుకు గాయాలయ్యాయి. వారికి మెరుగైన చిక్సత కోసం హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదంలో మరణించిన తల్లి , కూతురితో పాటుగా గాయపడిన ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి: