గుంటూరు అంబేడ్కర్ భవన్లో 'దళిత గిరిజన కోణంలో కేంద్ర బడ్జెట్' అనే అంశంపై సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డొక్కా మాణిక్యవరప్రసాద్ హజరయ్యారు. నూతనంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ కంపెనీలకు మాత్రమే లబ్ది చేకూర్చేలా ఉందని డొక్కా అన్నారు.
బడ్జెట్‌ని సవరణ చేసి దళిత గిరిజనులకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మరింత సాయం అందించాలన్నారు. దళిత గిరిజనులకు బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన సాయం అందించాలని... లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి సాధించుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: