ETV Bharat / city

పోస్టుమార్టం కోసం లంచం అడిగిన డాక్టర్‌పై చ‌ర్యలు త‌ప్పవు: మంత్రి రజిని

Minister Rajini: పోస్ట్​మార్టం కోసం డాక్టర్​ డబ్బులు డిమాండ్​ చేసిన ఘటనపై మంత్రి విడదల రజిని స్పందించారు. లంచం డిమాండ్ చేసిన‌ డాక్టర్‌ సంధాని బాషాపై చ‌ర్యలు త‌ప్పవన్న ఆమె... పోస్ట్​మార్టం కోసం ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. లంచం తీసుకున్నట్లు ఆరోపణలు వస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

Minister rajini
మంత్రి విడ‌ద‌ల ర‌జిని
author img

By

Published : May 5, 2022, 2:07 PM IST

Minister Fajini: నెల్లూరు జిల్లా ఉద‌య‌గిరి ఘ‌ట‌న‌పై మంత్రి విడ‌ద‌ల ర‌జిని స్పందించారు. రూ.16 వేలు లంచం డిమాండ్ చేసిన‌ డాక్టర్‌ సంధాని బాషాపై చ‌ర్యలు త‌ప్పవన్నారు. పోస్టుమార్టం కోసం లంచం డిమాండ్ చేయ‌డం అమాన‌వీయమన్నారు. సమాచారం రాగానే మెడిక‌ల్ ఆఫీస‌ర్ బాషాను స‌స్పెండ్ చేశామని తెలిపారు. పోస్టుమార్టం కోసం ఏ వైద్యుడికి కూడా డ‌బ్బులు ఇవ్వొద్దని సూచించారు. అధికారుల‌పై ఆరోప‌ణ‌లు వ‌స్తే ఉపేక్షించబోమని... వెంట‌నే చ‌ర్యలు తీసుకుంటామని మంత్రి రజిని స్పష్టం చేశారు.

ఏం జరిగిందంటే..?: నెల్లూరు జిల్లా ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. ఆకలితో అలమటిస్తున్న ఓ కూలీకి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. బ్రతుకు పోరాటంలో ఊరు కానీ ఊరు వచ్చారు. కొన్ని రోజులుగా తాము పనిచేస్తున్న యజమాని.. సరిగా డబ్బులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు ఓ వ్యక్తి. రెండు రోజులుగా ఎంతో మనోవేదన చెందాడు. అప్పులతో పూట గడవడం కష్టంగా మారింది. అంతా కష్టాల్లోనూ యజమాని డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ ఆలోచించి భార్యకు కూడా ఏమి చెప్పకుండా తోటలోకి వెళ్లి ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

భర్తను కోల్పోయి పట్టెడు దుఖంలో ఉన్న ఆ మహిళకు డాక్టర్ రూపంలో మరో కష్టం తలుపుతట్టింది. భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేసేందుకు ఉదయగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. శవపంచనామాకు లంచం అడిగాడు ఆ వైద్యుడు. చేతిలో చిల్లి గవ్వలేదని ఆమె వాపోయింది. ఎలాగైన తమ భర్తకు శవపంచనామా నిర్వహించమని కాళ్లవేళ్ల పడి ప్రాధేయపడింది. అయినా కనికరించేలేదు ఆ వైద్యుడు. పోస్టుమార్టం చేయాలంటే రూ.16వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫోన్​ పే చేయమని చెప్పి నెంబర్ ఇచ్చి వైద్య వృత్తికే కలంకం తెచ్చాడు. అన్ని విధాలుగా ప్రాధేయపడి.. విసిగిపోయిన ఆ మహిళ.. చివరకు వైద్యుడు సందాని బాషాపై ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి: అమానవీయం.. 108 వాహనం రాక... బైక్​ పైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.