ETV Bharat / city

జీజీహెచ్‌ వైద్యులు, సిబ్బంది పని తీరుపై మంత్రి మోపిదేవి అసంతృప్తి - minister mopidevi fires on guntur sarvajana hospital staff

జీజీహెచ్‌లో వైద్యులు, సిబ్బంది పనితీరుపై మంత్రి మోపిదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుపత్రికి ఉన్న వైభవాన్ని కాపాడాలని సిబ్బందికి సూచించారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో మల్టీ విటమిన్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.

జీజీహెచ్‌ వైద్యులు, సిబ్బంది పని తీరుపై మంత్రి మోపిదేవి అసంతృప్తి
author img

By

Published : Nov 19, 2019, 4:51 AM IST

గుంటూరు సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది పనితీరుపై మంత్రి మోపిదేవి వెంకటరమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాలింతలకు... మల్టీ విటమిన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి...జీజీహెచ్ కు ఎంతో పూర్వవైభవం ఉందని... దానిని కాపాడాలని సూచించారు. వైద్య సిబ్బందితీరుతో తరచూ వివాదాలు తలెత్తుతున్నాయన్న ఆయన... పేదలు కొండంత ఆశతో ఆసుపత్రికి వస్తారనే విషయాన్ని గుర్తించాలన్నారు. వైద్యసేవల కోసం ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేయాలని సూచించారు. జీజీహెచ్ లో వైద్య సిబ్బంది నియామకాలు జరుపుతామని...మౌలిక సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

జీజీహెచ్‌ వైద్యులు, సిబ్బంది పని తీరుపై మంత్రి మోపిదేవి అసంతృప్తి

ఇవీ చూడండి-కొడాలి నాని వ్యాఖ్యలపై బ్రహ్మణ సంఘాల ఆగ్రహం

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.