ETV Bharat / city

LAND DISPUTE: స్థల వివాదం.. అర్ధరాత్రి రోడ్డుపై బైఠాయించిన బాధితురాలు - narsaraopet latest news

LAND DISPUTE: గుంటూరు జిల్లా నరసరావుపేట గడియార స్తంభం సెంటర్ వద్ద అర్ధరాత్రి ఓ స్థలంపై వివాదం చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలంటున్న బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన రహదారిపై బైఠాయించి నినాదాలు చేసింది.

LAND DISPUTE
LAND DISPUTE
author img

By

Published : Dec 19, 2021, 12:40 PM IST

LAND DISPUTE: గుంటూరు జిల్లా నరసరావుపేట గడియార స్తంభం సెంటర్ వద్ద అర్ధరాత్రి ఓ స్థలం విషయంలో వివాదం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన జలసూత్రం అనూరాధ అనే మహిళ తన సొంత స్థలంలో రేకులతో ఇంటి నిర్మాణం చేసుకున్నామని తెలిపారు. ఆ స్థలంపై తమకు హక్కు ఉందంటూ.. అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు అనురాధ ఇంటిని ధ్వంసం చేసి కర్రలతో దాడికి యత్నించారు. ఘటనను వీడియో తీస్తున్న సెల్ ఫోన్లను సైతం వారు లాక్కు వెళ్లారంటూ బాధితురాలు ఆరోపించింది.

దాడి అనంతరం.. గడియార స్తంభం వద్దనున్న ప్రధాన రహదారిపై బైఠాయించి అనురాధ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పోలీసుల రాకతో అక్కడే ఉన్న ప్రత్యర్థులు పారిపోయారు. తమకు న్యాయం చేయాలంటున్న బాధితురాలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాన రహదారిపై నినాదాలు చేపట్టింది.

ఇదీ చదవండి: NO SUPPORT PRICE TO PADDY: పడిపోతున్న ధాన్యం ధరలు.. మోసపోతున్న వరి రైతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.