ETV Bharat / city

Nadendla: అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలా?: నాదెండ్ల - తెనాలిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం

Nadendla: రైతులకు ఏమాత్రం భరోసా ఇవ్వలేని ప్రభుత్వం.. వైకాపా అని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. వారం రోజుల్లో గుంటూరులో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని దుయ్యబట్టారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే పవన్ కల్యాణ్ యాత్రలు చేపడుతున్నారన్నారు.

Nadendla press meet in tenali
తెనాలిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం
author img

By

Published : Apr 21, 2022, 12:07 PM IST

Janasena Leader Nadendla: తెనాలిలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు ఏమాత్రం భరోసా ఇవ్వలేని ప్రభుత్వం వైకాపా అని మండిపడ్డారు. వారం రోజుల్లో గుంటూరులో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. అన్నపూర్ణ వంటి ఆంధ్రప్రదేశ్‌లో రైతుల ఆత్మహత్యలా అని ప్రశ్నించారు. రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా ఉందని దుయ్యబట్టారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే పవన్ కల్యాణ్ యాత్రలు చేపడుతున్నారని, ఈనెల 25న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పవన్ పర్యటిస్తారని వెల్లడించారు. త్వరలో గుంటూరు జిల్లాలో కూడా పవన్ పర్యటిస్తారని తెలిపారు. జనసేన తరఫున ఒక్కో కుటుంబానికి రూ.లక్ష సాయం అందిస్తామని ప్రకటించారు.

కౌలు రైతుల ఆత్మహత్యల వివరాలు ప్రభుత్వం ఎందుకు బయటకు రానీయట్లేదని ప్రశ్నించారు. పవన్ పర్యటన అనేసరికి ప్రభుత్వం హడావుడిగా పరిహారం ఇస్తోందని ఎద్దేవా చేశారు. వైకాపా నేతలు రైతుల కుటుంబాలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనేమో ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు కానీ.. విద్యుత్‌ కోతలతో రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. ప్రజలను ఆదుకోలేని ముఖ్యమంత్రి ఎందుకు అని విమర్శించారు. సొంత సంపాదనపైనే తప్ప ప్రజల సంక్షేమంపై దృష్టి లేదని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో దౌర్భాగ్యపు పాలనకు ఇదే నిదర్శనం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.