ఇదీ చదవండీ... బడ్జెట్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం
గంజాయి లిక్విడ్: 'విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి' - Ganja Smuggling in Guntur
గుంటూరు నగరంలోని అరండల్‌పేట, నగరంపాలెం, పాతగుంటూరు పోలీసు స్టేషన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో గంజాయి ముఠాల ఆటకట్టించారు అర్బన్ పోలీసులు. ఆయా ప్రాంతాల్లో విస్తృత దాడులు నిర్వహించిన పోలీసులు... ఏడుగురిని అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. నిందితుల వద్ద నుంచి 2కిలోల 400 గ్రాముల గంజాయి, 65 చిన్న డబ్బాల్లో నిల్వ ఉంచిన గంజాయి లిక్విడ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి మీడియా సమావేశంలో వివరించారు. మాదకద్రవ్యాలు విక్రయించే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని... రౌడీషీట్లు తెరుస్తామని ఎస్పీ హెచ్చరించారు. కాలేజీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వ్యాపారం సాగుతుందని.. విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు.
అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి
ఇదీ చదవండీ... బడ్జెట్ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోదం