గుంటూరు జిల్లాలో 15 రోజుల వరకు ఉచిత రేషన్ పంపిణీ చేస్తామని.. ప్రజలు ఆందోళనకు గురి కావద్దని కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు రేషన్ షాపులు తెరుస్తామని చెప్పారు. ప్రభుత్వ సర్వజనాసుపత్రిలో సాధారణ ఓపీ సేవలు నిలిపివేశామని.. కేవలం అత్యవసర సేవలే అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ప్రజలు లాక్డౌన్కు సహకరిస్తూ.. స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడే కరోనాను అరికట్టవచ్చని అన్నారు.
ఇదీ చూడండి: