ETV Bharat / city

కాలి బూడిదైన 20 గుడిసెలు.. ఎక్కడంటే..?

ఎవరు లేని సమయంలో విద్యుత్​షార్ట్​ సర్క్యూట్​ కారణంగా ఓ పూరి గుడిసెలో చెలరేగిన మంటల వల్ల 20 గుడిసెలు దగ్ధమయ్యాయి. క్షణాల్లోనే మిగిలిన ఇళ్లు క్షణాల్లో అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని పారిశ్రామికవాడలో జరిగింది.

fire accident in a yerrabalem Industrial area
ఎర్రబాలెంలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
author img

By

Published : Jan 25, 2021, 7:32 PM IST

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలోని పారిశ్రామికవాడలోని 20 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. పారిశ్రామిక వాడలో 20 మంది పేదలు.. గుడిసెలు వేసుకొని నివాసముంటున్నారు. అందరూ పనులకు వెళ్లిన సమయంలో ఓ ఇంట్లో విద్యుత్​ షార్ట్​ సర్క్యూట్​ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు క్షణాల్లోనే మిగిలిన పూరిళ్లకు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే ఆ ఇళ్లు కాలి బూడిదయ్యాయి.

ఒక్కో ఇంటికి సుమారు రూ. 30వేల మేర ఆస్తినష్టం వాటినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ ప్రమాదంలో ఇళ్లు మొత్తం కాలి పోయాయని.. కట్టుకున్న బట్టలు మాత్రమే మిగిలాయని బాధితులు వాపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వాళ్లు కోరారు.

ఎర్రబాలెంలోని పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: వాయిస్ మెసేజ్ పెట్టి.. ఆత్మహత్య చేసుకున్నాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.