రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రకటనపై అమరావతి ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాలలో నిరసనకు దిగారు. తుళ్లూరు మండలం వెంకటపాలెం, మందడం, రాయపూడి, వెలగపూడి గ్రామాలలో రైతులు ధర్నా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో రాజధానిగా అమరావతికి మద్దతు తెలిపారని... ఇప్పుడు మాట తప్పారని రైతుల విమర్శించారు. 'మాట తప్పను.. మడమ తిప్పను' అన్న ముఖ్యమంత్రి ఇప్పుడేం సమాధానం చెబుతారని నిలదీశారు. భారత్ కంటే దక్షిణాఫ్రికా అన్ని రంగాలలో వెనుకంజలో ఉందని అలాంటి దేశాన్ని ఎలా ఆదర్శంగా తీసుకుంటారని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ మూడు రాజధానులు లేవని రైతులు ఎద్దేవా చేశారు ముఖ్యమంత్రి తన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అమరావతిలోని శాశ్వత రాజధాని నిర్మించాలని రైతులు డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి