గుంటూరులో 'ఈనాడు' స్పోర్ట్స్ లీగ్ ఘనంగా ప్రారంభమైంది. స్థానిక ప్రైవేట్ కళాశాల మైదానంలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, చెస్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలుత జేకేసి కళాశాల విద్యార్థులు, కళ్లం హరనాథరెడ్డి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల మధ్య కబడ్డీ పోటీ హోరాహోరీగా సాగింది. గ్రామీణ యువ క్రీడాకారులు పోటీపడి తమ ప్రతిభను ప్రదర్శించారు. యువతరానికి ఇదో గొప్ప అవకాశమని కళాశాల ఛైర్మన్ వైవీ ఆంజనేయులు అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి :