ETV Bharat / city

'నరసరావుపేట జేఎన్టీయూ నిర్మాణానికి సహకరిస్తాం'

గుంటూరు జిల్లా నరసరావుపేట జేఎన్టీయూ నిర్మాణానికి సహకరిస్తామని విద్యాశాఖ మంత్రి అన్నారు. కళాశాలల్లో విద్యార్థుల బకాయిలు విడతల వారీగా విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

నరసారావు పేట జేఎన్టీయూ నిర్మాణానికి సహకరిస్తాం:విద్యాశాఖ మంత్రి
author img

By

Published : Sep 1, 2019, 10:01 PM IST

నరసారావు పేట జేఎన్టీయూ నిర్మాణానికి సహకరిస్తాం:విద్యాశాఖ మంత్రి
రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు వైకాపా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నరసరావుపేట జేఎన్టీయూ నిర్మాణానికి సహకరిస్తామని మంత్రి స్పష్టం చేశారు. త్వరలో కళాశాలకు 80 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం ఉంటుందన్నారు. త్వరలో విద్యార్థుల బకాయిల మొత్తం విడతల వారీగా విడుదల చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.

అమ్మఒడి పథకం జనవరి 23నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సురేష్ తెలిపారు. పథకం గురించి సీఎం జగన్ ప్రకటించిన వెంటనే...అనూహ్య స్పందన లభించిందని...3నెలల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో 2లక్షలకు పైగా కొత్తగా విద్యార్థులు చేరారని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక వసతులకు ప్రభుత్వం కృషి చేస్తోందని... సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు.

ఇవీ చూడండి-అన్వేషిక.... భావి శాస్త్రజ్ఞులకు వేదిక

Intro:ap_gnt_81_01_vidhyaa_saakha_manthri_pressmeet_avb_ap10170

విద్యా వ్యవస్థకు పెద్దపీట: ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ మంత్రి

రాష్ట్రంలో విద్యా వ్యవస్థకు వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. నరసరావుపేట వైసీపీ కార్యాలయంలో ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కలసి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Body:నరసరావుపేట జేఎన్ టీయూ కళాశాల గత ప్రభుత్వ హయాంలో మంజూరై నాలుగు సంవత్సరాలు గడిచినా కనీసం ప్రహరీ గోడ నిర్మాణానికి కూడా నోచుకోకపోవడం దారుణమన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చొరవతో యుద్ధ ప్రాతిపదికన ప్రహరీ గోడ నిర్మాణమవడం సంతోష దాయకమన్నారు. అదే విధంగా కళాశాలకు కావలసిన భవనాలు కూడా త్వరగా పూర్తయ్యేలా మా సహాయ సహకారాలు వుంటాయని తెలిపారు. కళాశాలకు అవసరమైన 80 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం భర్తీ చేస్తామన్నారు.

Conclusion:అదేవిధంగా రాష్ట్రంలో కళాశాల విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించవలసిన బకాయిల మొత్తాన్ని త్వరలో విడతల వారీగా చెల్లిస్తామన్నారు. వైసీపీ అధినేత జగన్ మోహనరెడ్డి విద్యా రంగంపై పెట్టుకున్న ఆశలు నెరవేరేలా అమ్మఒడి పథకానికి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ప్రస్తుతం అమ్మఒడి పధకం వచ్చే జనవరి 26న మొదలవుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు రెండు లక్షల పై చిలుక విద్యార్థులు కొత్తగా చేరారని వివరించారు. రాబోయే కాలంలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటే సిఫారసు తో వచ్చేలా విద్యారంగాన్ని తయారు చేస్తామని తెలిపారు.

అనంతరం ఎమ్మెల్యే గోపిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు స్వాతంత్య్రం వచ్చి 72 సంవత్సరాలు గడచిన ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కారువయ్యాయని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఈ సమస్యలను నివారించే దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు.

ఆర్.చంద్రశేఖరరావు,
ఈటీవీ రిపోర్టర్,
నరసరావుపేట,
9885066052.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.