గుంటూరు నగరంలోని 5 కేంద్రాల్లో కొవిడ్ టీకా రెండో విడత పంపిణీ ప్రారంభమైంది. మొదటి డోసు టీకా వేయించుకుని.. 7 నుంచి 8 వారాలు పూర్తయిన వారికి మొదటి ప్రాధాన్యతగా ఇవాళ వ్యాక్సినేషన్ చేపట్టారు. గతంలో టీకా వేయించుకున్న సమయం ఆధారంగా లబ్ధిదారుల ఫోన్లకు సందేశం పంపిస్తున్నారు. వారు మాత్రమే వ్యాక్సినేషన్ కేంద్రానికి రావాలని అధికారులు సూచించారు. సందేశం రాకుండా వచ్చిన ఒకరిద్దరిని వెనక్కి పంపించారు.
ఇదీ చదవండి: కరోనా భయం- తుపాకీతో కాల్చుకుని మృతి
కొవిడ్‌తో పోరాడుతున్న, 60 ఏళ్లు దాటిన వారికి మాత్రమే ప్రస్తుతం రెండో విడత టీకా అందిస్తున్నారు. వారందరికీ పూర్తయిన అనంతరం 45 నుంచి 60 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. త్వరలోనే మరో 6 కేంద్రాల్లో టీకా పంపిణీ ప్రారంభిస్తామని మేయర్ కావటి మనోహరనాయుడు తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద రద్దీ నియంత్రించేలా చర్యలు చేపట్టామన్నారు. కరోనా నుంచి తప్పించుకునేందుకు మాస్క్, భౌతిక దూరంతో పాటు టీకా మాత్రమే రక్షణ కల్పిస్తుందన్నారు.
ఇదీ చదవండి:
రెండో డోసు వ్యాక్సినేషన్.. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రాధాన్యం