ETV Bharat / city

గుంటూరులో కరోనా ఉద్ధృతి.. అధికారులు అప్రమత్తం!

గుంటూరులో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యమైన కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. షాపింగ్ మాల్స్​లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ అనురాధ సూచించారు.

covid awarness programmes in guntur city
గుంటూరులో కరోనా అవగాహన కార్యక్రమాలు
author img

By

Published : Apr 15, 2021, 10:47 PM IST

గుంటూరులో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే బహిరంగ ప్రదేశాల్లో నగరపాలక సంస్థ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. షాపింగ్ మాల్స్​లో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ చల్లా అనురాధ సూచించారు.

కేసులు ఎక్కువగా నమోదవుతోన్న ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. పాజిటివ్​గా తేలిన వారి వివరాలు వారి ప్రైమరీ కాంటాక్ట్స్ సేకరించాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించటం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వినియోగించడం చేయాలని ప్రజలకు సూచించారు.

ఇదీ చదవండి:

జిల్లాలో రికార్డు స్థాయిలో 621 కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.