ETV Bharat / city

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 11,296కు చేరిన పాజిటివ్​ కేసులు - గుంటూరులో కరోనా కేసుల వార్తలు

గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. శనివారం ఒక్కరోజే జిల్లాలో కొత్తగా 656 మందికి కరోనా సోకినట్లు అధికారులు నివేదిక విడుదల చేశారు. మొత్తం కేసుల సంఖ్య 11,296కు చేరింది. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

జిల్లాలో కరోనా ఉద్ధృతి.. 11,296కు చేరిన పాజిటివ్​ కేసులు

author img

By

Published : Jul 25, 2020, 10:53 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. జులైలోనే 9,691 కేసులు నమోదయ్యాయంటే వైరస్​ ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. కరోనా బారిన పడి ఇప్పటివరకూ 97 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం నమోదైన కేసుల్లో ఒక్క గుంటూరు నుంచే 155 కేసులు నమోదయ్యాయి. నరసరావుపేటలో 81, దాచేపల్లిలో 72, సత్తెనపల్లిలో 53, తెనాలిలో 49, పిడుగురాళ్లలో 33, మాచవరం 21, చిలకలూరిపేటలో 17, ఫిరంగిపురంలో 15, మేడికొండూరులో 13, తాడికొండ, తాడేపల్లి, బొల్లాపల్లి 10, బాపట్ల 9, రాజుపాలెం 7, వినుకొండల్లో 6 కేసులు నమోదయ్యాయి.

ఇప్పటి వరకూ జిల్లాలో కరోనా నుంచి కోలుకుని 4,752 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. జిల్లాలో ప్రస్తుతం కొవిడ్ రోగుల కోసం 8 ప్రభుత్వ, 12 ప్రైవేటు ఆసుపత్రుల్లో 3,715 పడకలు సిద్ధంగా ఉంచామని.. అక్కడ చికిత్స అందిస్తున్నామని జిల్లా యంత్రాంగం చెబుతోంది. కరోనా నియంత్రణకు ప్రజల సహకారమే కీలకమని... అంతా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదీ చూడండి..

రాష్ట్రంలో కొత్తగా.. 7,813 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.