ETV Bharat / city

ఏపీలో కరోనా తగ్గుముఖం.. 6 వందల లోపే కేసులు - Corona effect on ap

రాష్ట్రంలో కొత్తగా 520 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,74,515కు చేరింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.62 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,06,99,622 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనాతో కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు.

ఏపీలో కరోనా తగ్గుముఖం.. 6 వందల లోపే కేసులు

author img

By

Published : Dec 11, 2020, 8:30 PM IST

రాష్ట్రంలో కొత్తగా 520 కరోనా కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. కరోనా బాధితుల సంఖ్య 8,74,515కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో 7,049 మంది మృతిచెందారు. వైరస్​ నుంచి మరో 519 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8.62 లక్షలకు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5,236 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 64,425 కరోనా పరీక్షలు చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,06,99,622 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.

కరోనాతో కృష్ణా, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. చిత్తూరులో 108, కృష్ణాలో 71, పశ్చిమగోదావరి జిల్లాలో 69, గుంటూరులో 64, తూర్పుగోదావరి జిల్లాలో 59, విశాఖలో 34, అనంతపురంలో 29, ప్రకాశంలో 21, కర్నూలులో 20, నెల్లూరులో 13, విజయనగరం జిల్లాలో 12, శ్రీకాకుళంలో 11, కడప జిల్లాలో 9 కరోనా కేసులు నమోదయ్యాయి.

గుంటూరు జిల్లాలో..

గుంటూరు జిల్లాలో కొవిడ్ కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 64 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 73,709 కి చేరింది. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరం నుంచి 18 ఉన్నాయి. ప్రత్తిపాడు-5, రేపల్లె-5, కొల్లూరు-4, అమరావతి-3, తాడేపల్లి-3, రొంపిచర్ల-3 కేసుల చొప్పున నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 72,362 మంది డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ బారిన పడి గుంటూరులో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 655కి చేరింది.

కర్నూలు జిల్లాలో..

కర్నూలు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. జిల్లాలో శుక్రవారం 20 మందికి పాజిటివ్ వచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 60,354 మందికి కరోనా సోకగా 59,763 మంది వైరస్​ను జయించారు. 104 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు జిల్లాలో కరోనాతో 487 మంది చనిపోయారని వైద్యాధికారులు తెలిపారు.

ఇదీ చదవండీ... అంగళ్లులో అలజడి..తెదేపా నేతలపై వైకాపా శ్రేణుల దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.