గుంటూరు జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఆదివారం ఒక్కరోజే జిల్లాలో 101 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,386కు పెరిగింది. తాజాగా గుంటూరులో 63 పాజిటివ్ కేసులు గుర్తించారు. నగరంలోని నల్లచెరువు ప్రాంతంలో 37 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది.
నల్లపాడులో 6, ఆర్.అగ్రహారంలో 4, బ్రాడీపేటలో 3, సంపత్ నగర్లో 3, శ్రీనివాసరావుతోటలో 2 కేసులు చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాలో నరసరావుపేటలో మరో 14 కేసులు, తెనాలిలో 4, మాచర్లలో 5, మంగళగిరిలో 3, దాచేపల్లిలో 2 కేసులు చొప్పున బయటపడ్డాయి.
ఇదీ చదవండి: