బ్లాక్ ఫంగస్‌ను ముందుగానే గుర్తిస్తే.. చికిత్సతో నయమవుతోందని.. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసపత్రుల సంఘం అధ్యక్షులు డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్లాక్‌ఫంగస్ చికిత్సకు సంబంధించి కొన్ని ఆసుపత్రులను నోటిఫై చేసిందన్నారు. అలాగే ప్రైవేటుగా ఈఎన్టీ ఆసుపత్రుల్లోనూ వైద్యం అందుబాటులో ఉందని వివరించారు.
కరోనా చికిత్సలో స్టెరాయిడ్ల వాడకం తప్పనిసరైందని.. అయితే రోగి శరీరంలో చక్కెర స్థాయిలు నిరంతరం పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తే ఈ ఫంగస్ బారిన పడే అవకాశాలు ఉండవన్నారు. దీంతో పాటు ఆక్సిజన్ సరఫరాకు సంబంధించిన పరికరాలు సరిగా లేకపోయినా ఫంగస్ బారిన పడే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆసుపత్రి స్థాయిలోనే బ్లాక్ ఫంగస్ వ్యాప్తిని నియంత్రిస్తున్నట్లు తెలిపారు. లక్షలాది కొవిడ్ కేసుల్లో.. కేవలం పదుల సంఖ్యలో బాధితులు మాత్రమే ఇలాంటి ఫంగస్ బారిన పడుతున్నందునా.. ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: