భాజపాకి అనుబంధంగా పనిచేస్తున్న భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఏపీ విభాగాన్ని.. ఆ సంస్థ అఖిల భారత అధ్యక్షుడు అర్నబ్ ఛటర్జీ గుంటూరులోని అరండల్‌పేటలో ప్రారంభించారు. సంఘటిత రంగ కార్మికుల సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తమ ఉద్దేశ్యమని.. ఏపీ ఇంఛార్జ్ శివప్రసాద్ తెలిపారు. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఈ విభాగం సేవలందిస్తోందని వెల్లడించారు. రానున్న రోజుల్లో జిల్లాల వారీగా కమిటీలను నియమిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పరీక్షలకు అనుమతించాలంటూ.. డీఈడీ విద్యార్థుల ఆందోళన