ETV Bharat / city

Baby at roadside: "నేనేం పాపం చేశానమ్మ... నన్నేందుకు ఇక్కడ వదిలేశారు" - బాపట్ల లేటెస్ట్ అప్​డేట్స్

Baby at roadside: నులివెచ్చని అమ్మపొత్తిళ్లలో ఉండాల్సిన పసిపాప.. రోడ్డు పక్కన పడి ఉంది. తల్లిపాల తొలి రుచి చూడాల్సిన ఆ పసికందు ఆకలితో అలమటించింది. కంటిపాపగా కాపాడుకోవాల్సిన ఆ తల్లి.. కనీసం బొడ్డు కూడా ఊడని ఆ బిడ్డను రహదారి పక్కన వదిలేసి వెళ్లింది.

Baby by the roadside
రోడ్డు పక్కన పసికందు
author img

By

Published : Apr 6, 2022, 7:21 PM IST

Baby at roadside: బిడ్డ ఏడుపు శబ్ధం వింటేనే తల్లి మనసు తల్లడిల్లుతుంది. శిశువు ఆకలి తీరిస్తే తన కడుపు నిండినంత సంతోషపడుతుంది. చిన్నారి కేరింతలు కొడుతుంటే సంబరపడుతుంది. కానీ ఓ తల్లి మాత్రం వీటన్నింటికి విరుద్ధంగా కన్న బిడ్డను కనికరం లేకుండా రోడ్డుపక్కన వదిలేసి వెళ్లిపోయింది. ఈ అమానవీయ ఘటన బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం వింజనంపాడులో చోటు చేసుకుంది.

Baby at roadside: బొడ్డు కూడా ఊడని స్థితిలో రోడ్డు పక్కన పసికందును స్థానికులు గుర్తించారు. బొడ్డు కూడా ఊడని స్థితిలో శిశువును చూసి కన్నీరు పెట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పసికందును యద్దనపూడి పీహెచ్​సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఆడపిల్ల అని వదిలేసి ఉండొచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి: Case on constable: కానిస్టేబుల్​పై కేసు నమోదు... కారణం అదే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.