ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి విషయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు ఆరోపించారు. జులై 1 నుంచి మాత్రమే 27 శాతం మధ్యంతర భృతి ఇస్తున్నామని చెప్పటం ఉద్యోగులను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. అసలు ఉద్యోగులు కోరుకున్నది వేతన సవరణే తప్ప మధ్యంతర భృతి కాదని స్పష్టం చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో పదవి విరమణ చేసిన వారికి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రద్దు చేయటాన్ని అశోక్ బాబు తప్పుబట్టారు.
ఇదీ చదవండి :