ETV Bharat / city

Badwel By-Poll: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే బద్వేలులో పోటీ: శైలజానాథ్

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే బద్వేలు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ బరిలోకి దిగబోతోందని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. విశాఖ ఉక్కు సహా ప్రభుత్వ ఆస్తుల ప్రైవేటీకరణ ఆగాలంటే కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు.

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ

author img

By

Published : Oct 5, 2021, 7:14 PM IST

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకే బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ

కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. వైకాపా అసమర్థత పాలనను, అన్యాయాన్ని ప్రశ్నించడానికే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. రాష్టంలో పరిపాలన రోజురోజుకీ దారుణంగా తయారువుతోందన్న ఆయన...ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజల్లోకి వెళుతున్నామన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయని..,శాంతి భద్రతలు క్షీణించాయని ఆక్షేపించారు. స్థానిక ఎన్నికల్లో కడప జిల్లాలో ఎన్ని దారుణాలు జరిగాయో చూశామని..దౌర్జన్యాలకు, దాడులకు కాంగ్రెస్ పార్టీ భయపడదన్నారు. విశాఖ ఉక్కు, ప్రభుత్వ ఆస్తులు ప్రవేటీకరణ ఆగాలంటే..ఒక్క కాంగ్రెస్​తోనే సాధ్యమవుతోందన్నారు.

అభ్యర్థి ఖరారు

బద్వేలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కమలమ్మ బరిలోకి దిగనున్నారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆమె పేరును ఖరారు చేసింది.

వైకాపా అభ్యర్థి నామినేషన్ దాఖలు

కడప జిల్లా బద్వేలు ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా డాక్టర్ సుధ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేతన్ గార్గ్​కు నామినేషన్ పత్రాలు అందజేశారు.

జనసేన, తెదేపా దూరం

బద్వేలు ఉపఎన్నికలో జనసేన పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్​ కల్యాణ్​ వెల్లడించారు. మరణించిన ఎమ్మెల్యే సతీమణికే టికెట్ ఇచ్చినందున మానవతా దృక్పథంతోనే బద్వేలులో పోటీ చేయడం లేదన్నారు. నియోజకవర్గానికి చెందిన జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

బద్వేలు ఉపఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ప్రధాన ప్రతిపక్షం తెదేపా నిర్ణయించింది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశంలో..ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే అధికార వైకాపా టికెట్‌ ఇవ్వటంతో..ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించినట్లు తెదేపా తెలిపింది.

వారసత్వాలను ప్రోత్సహించం: భాజపా

బద్వేలు ఉపఎన్నికను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. ఆ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. బద్వేలు ఉప ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాజకీయాల్లో కుటుంబ వారసత్వాలను భాజపా ప్రోత్సహించదని ఆయన స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణిస్తే.. ఆయన భార్య పోటీ చేసినంత మాత్రానా తప్పుకోవాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి

Badwel By-Poll: 'లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యం'..వైకాపా అభ్యర్థి నామినేషన్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.