ప్రభుత్వ నిబంధనల మేరకు జూనియర్ కాలేజీలను నిర్వహించడం లేదని.. ఏపీ స్కూల్ ఏడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు నారాయణ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా పెదపలకలూరిలోని పలు జూనియర్ కాలేజీలో ముగ్గురు సభ్యుల కమిటీ తనిఖీలు నిర్వహించింది. తాగునీరు, డ్రైనేజ్, వంటగదులు, పడక గదులను పరిశీలించిన కమిటీ సభ్యులు.. విద్యార్థులకు బోధిస్తున్న టీచర్ల విద్యార్హతలు అడిగి తెలుసుకున్నారు.
కాలేజీలో కొవిడ్ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేయలేదని నారాయణ రెడ్డి చెప్పారు. క్వాలిఫైడ్ టీచర్లు లేరని, తాగునీరు, డ్రైనేజ్ ఏర్పాట్లు సక్రమంగా లేవన్నారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని వివరించారు. అధిక సమయం క్లాసులు నిర్వహిస్తున్నారని... హాస్టల్లో ఒకే గదిలో 8 మంది విద్యార్థులను ఉంచుతున్నారని చెప్పారు. పెదపలకలూరిలోని పలు కాలేజీలో పరిస్థితులపైన ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. తదుపరి ప్రభుత్వ ఆదేశాలు మేరకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పలు కాలేజీల్లో తనిఖీలు నిర్వహించామని చెప్పారు.
ఇదీ చదవండీ... ముగిసిన చివరి విడత పంచాయతీ ఎన్నికలు..మధ్యాహ్నం 2.30 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా