రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరులో ఐకాస చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న రాజకీయ ఐకాస నేతలు... కార్పోరేషన్ కార్యాలయం వద్దకు రాగానే పోలీసులు అడ్డుకున్నారు. తెదేపా నేత ప్రత్తిపాటి పుల్లారావు, వామపక్షనేతల్ని అరెస్ట్ చేశారు. పోలీసుల తీరు పట్ల ప్రత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామన్నారు
ఇదీ చదవండి
పోలీసుల గుప్పెట్లో అమరావతి....