రాష్ట్రంలో ఇంకా పరిహారం అందని అగ్రిగోల్డ్ బాధితులు వేలమంది ఉన్నారని.. వారికి వెంటనే పరిహారం అందించాలని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. ఈమేరకు ఆయన వివరాలు వెల్లడించారు. కట్టిన సొమ్ము రూ.10 వేల లోపు ఉన్నవారికి ప్రభుత్వం కొంతమొత్తం చెల్లించిందని అన్నారు.
హామీలు అమలు చేయాలి
అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోగా రూ.20 వేల లోపున్న వారికి రూ.1,150 కోట్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు నాగేశ్వరరావు గర్తు చేశారు. మిగిలిన వారికి కాలపరిమితితో ఇస్తామన్న హామీని సైతం అమలు చేయాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్య ఆర్థిక దాహానికి 350 కుటుంబాలు బలయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని లేఖలో కోరారు.
ఇదీ చూడండి: