ETV Bharat / city

బామ్మ సంకల్పం... వృద్ధాప్యంలో అమ్మతనం - వృద్ధాప్యంలో అమ్మతనం

వారిది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామం. పెళ్లై 57 ఏళ్లు. కానీ సంతాన భాగ్యం కలగలేదు. పిల్లలు లేరని ఇరుగుపొరుగు వాళ్లు అనే సూటిపోటి మాటలతో బాధపడుతూ ఉండేవారు. ఏ శుభకార్యానికి వెళ్లినా... ఆవేదనకు గురయ్యేవారు. తమకు పిల్లల పుట్టాలని వారు మొక్కని దేవుడు లేడు... తిరగని ఆస్పత్రి లేదు. ఇన్నాళ్లకు కరుణ కలిగిందేమో భగవంతుడికి... వారి కల సాకారం చేశాడు. 73 ఏళ్లకు కవలపిల్లలకు జన్మనిచ్చింది ఓ బామ్మ. ఆమె పేరు మంగాయమ్మ. గతంలో 70 ఏళ్లకు పిల్లలు పుట్టిన ఘటన.. ప్రపంచ రికార్డుగా ఉండేది. ఇప్పుడు మంగాయమ్మ 73 ఏళ్ల వయసులో తల్లి కావటం ద్వారా ఆ రికార్డునూ అధిగమించారు.

వృద్ధాప్యంలో అమ్మతనం
author img

By

Published : Sep 5, 2019, 11:53 PM IST

వృద్ధాప్యంలో అమ్మతనం

తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు గ్రామంలో మంగాయమ్మ - రాజారావు దంపతులున్నారు. వీరికి పిల్లలు లేరు. అన్ని ప్రయత్నాలు చేసి.. చివరికి గుంటూరులోని అహల్య ఆస్పత్రి వైద్యులను ఆశ్రయించారు. ఇప్పటికే వృద్ధ దంపతులైన వీరి ధైర్యాన్ని చూసిన వైద్యులు వెనక్కి తగ్గలేదు. వారి ఆశలకు వైద్యాన్ని జతచేశారు. పెళ్లైన 57ఏళ్ల తర్వాత మంగాయమ్మ.. కృత్రిమ విధానం ద్వారా గర్భం దాల్చేలా చేశారు.... డా.శనక్కాయల అరుణ ఉమా శంకర్. 73 ఏళ్ల మంగాయమ్మకు శస్త్రచికిత్స చేసి... ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చేలా చేశారు.

ఘనకీర్తీ...
సంతాన సాఫల్య పరిజ్ఞానంలో గుంటూరు వైద్యులు ఘనకీర్తి సాధించారు. 73 ళ్ల వయసున్న మహిళకు కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలు లేని లోటు తీర్చారు. ఇదంతా ఆధునిక వైద్య పరిజ్ఞానం గొప్పదనమని వైద్యులు చెబుతుంటే.... ఇది వైద్యుల ఘనతగా మంగాయమ్మ దంపతులు కొనియాడుతున్నారు. ఏది ఏమైనా ఇంత లేటు వయసులో తల్లి కావటం ద్వారా మంగాయమ్మ రికార్డు సృష్టిస్తే... ఆమెకు వైద్యం చేసిన డాక్టర్లు... అందుకు వేదికైన గుంటూరు నగరం కూడా వైద్యచరిత్ర పుటల్లో నిలిచింది.

వైద్యుల శ్రమ అంతాఇంతా కాదు...
మంగాయమ్మకు మాతృభాగ్యం కలిగించటంలో వైద్యుల శ్రమ అంతాఇంతా కాదు. ఆమె కృత్రిమ గర్భధారణ విధానం ఎంచుకున్నప్పటి నుంచి పిల్లలు పుట్టే వరకూ... ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారు. గతంలో వేరే చోట్ల ఐవీఎఫ్ విధానంలో ప్రయత్నించినా మంగాయమ్మ ఆశలు తీరలేదు. ఈ ఆసుపత్రిలో మాత్రం మొదటి ప్రయత్నంలోనే గర్భం దాల్చారు. అప్పటినుంచి వైద్యులు మంగాయమ్మను కంటికి రెప్పలా కాపాడారు. అవసరమైన పోషకాహారం అందించారు.

మంగాయమ్మకు కృత్రిమ గర్భధారణ కావటం... వయసు పైబడటం కారణంగా సిజేరియన్ తప్పనిసరని తేల్చారు. అయితే ఆపరేషన్ సమయంలో రక్తం ఎక్కువగా పోతే ప్రాణాలకు ప్రమాదం. అందుకే ఆమెలో రక్తవృద్ధి ఎక్కువగా జరిగేలా ఆహారం అందించారు. ప్రసవ సమయం దగ్గరికి వచ్చేకొద్దీ వైద్యులు మరింత అప్రమత్తమయ్యారు. 11 మంది నిపుణులు బృందంగా ఏర్పడి... సిజేరియన్ సజావుగా జరిగేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కృత్రిమ గర్భధారణలో నిపుణులైన ఉమాశంకర్, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి... గైనకాలజి నిపుణులు శనక్కాయల అరుణ, రాజకుమారి, నీలిమ, కీర్తి, అరుణ కలిసి కాన్పు చేశారు. ఆ వృద్ధురాలి కల నెరవేర్చారు.

ప్రస్తుతం పిల్లలు ఒక్కొక్కరు కేజీన్నర బరువు ఉన్నారు. వాళ్లు 2కిలోల బరువుకు వచ్చే వరకూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. మంగాయమ్మకు పాలిచ్చే సామర్థ్యం ఉండదు కాబట్టి... పిల్లల పోషణ విషయంలో జాగ్రత్తలు తప్పవని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి, ప్రముఖ వైద్యురాలు శనక్కాయల అరుణ చెప్పారు. మరోవైపు... మంగాయమ్మకు సంతానం కలగటంపై బంధువుల్లోనూ ఆనందం వ్యక్తమైంది. మిఠాయిలు పంచుకుని ఆనందాన్ని పంచుకున్నారు. వైద్యులను అభినందించారు.

ఇదీ చదవండి

మండలానికో 108 వాహనం... ప్రభుత్వ నిర్ణయం

Intro:అనంతపురం జిల్లా ధర్మవరంలో గణేష్ నిమజ్జనం కోలాహలంగా జరిగింది పట్టణంలోని గాంధీనగర్ కూడలి వద్ద నుంచి ప్రధాన రహదారి మీదుగా వినాయక విగ్రహాలను ఊరేగించారు ఊరేగింపు లో పాల్గొన్న యువకులు నృత్యాలు చేశారు ధర్మవరం చెరువులో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేశారు నిమజ్జనం కార్యక్రమానికి సంఖ్యలో ప్రజలు చెరువు వద్దకు తరలివచ్చారు

Body:గణేష్ నిమజ్జనం

Conclusion:అనంతపురం జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.