రేపటి నుంచి కర్ఫ్యూ నిబంధనలు సడలించనున్న తరుణంలో గుంటూరు జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు 103 ఆర్టీసీ బస్సు సర్వీసులను పునరుద్ధరించనున్నారు. 13 డిపోల ద్వారా రేపటి నుంచి మొత్తం 503 బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ నగరానికి గుంటూరు, మాచర్లతోపాటు పలు డిపోల నుంచి 12 సర్వీసులను నడపనున్నారు. కొవిడ్ రెండో దశ వ్యాప్తి అనంతరం మొత్తం మీద రేపటి నుంచి 70 శాతం బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని గుంటూరు ఆర్టీసీ ఆర్.ఎం. రాఘవకుమార్ చెప్పారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ రాఘవకుమార్ సూచించారు.
ఇదీ చదవండీ... APSRTC: రేపట్నుంచి తెలంగాణకు బస్సులు నడపాలని ఏపీఎస్‌ఆర్టీసీ నిర్ణయం