పెళ్లింట విషాదం నెలకొంది. సోదరి పెళ్లిలో తోరణాల కోసం మామిడి ఆకులు కోస్తూ.. చెట్టుపై నుంచి సోదరుడు కిందపడ్డాడు. యువకుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. కుమారుడి మరణంతో ఈ ఇల్లు చావు కేకలతో మార్మోగింది. పెళ్లితో కళకళలాడాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి. పెళ్లికి వచ్చిన బంధువుల కళ్లన్నీ కన్నీటితో నిండిపోయాయి. ఈ విషాదకర ఘటనలో ఏలూరు జిల్లాలో జరిగింది.
ఏలూరు జిల్లా కైకలూరు మండలం గోపవరంలో చెట్టుపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. సోదరి పెళ్లి కోసం మామిడి చెట్టు ఎక్కి ఆకులు కోస్తుండగా కాలు జారి కిందపడటంతో తల వెనుక భాగంలో బలమైన గాయమైంది. కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి.. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిలకాబత్తిన సాయి మృతి చెందాడు. ఈ ఘటనతో ఊరంతా విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి తండ్రి రామారావు ఫిర్యాదు మేరకు... కైకలూరు టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇవీ చదవండి: