- నిలకడగా...
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 69,088 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,506 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే బాధితులుగా ఉన్న వారిలో.. 16 మంది మరణించారు. మరోవైపు.. 1,835 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'బాధిత కుటుంబీకులను ఆదుకుంటాం'
గుంటూరు నగరంలో పట్టపగలే దారుణ హత్య (Murder in Guntur)కు గురైన రమ్య మృతదేహాన్ని హోం మంత్రి (Home Minister Sucharitha) పరిశీలించారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. బాధిత కుటుంబీకులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'సబ్ లీజుల పేరుతో ఇసుక దోపిడీ'
లెక్కల్లో తేడాలు రావడం వల్లే మంత్రి వెల్లంపల్లి చేస్తున్న ఇసుక దోపిడీ వ్యవహారం బయటకొచ్చిందని తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం ఆరోపించారు. సబ్ లీజుల మాటున జరుగుతున్న వ్యవహారానికి ప్రకాశ్ పవర్ సంస్థ ఉద్యోగి ఫిర్యాదే నిదర్శనమన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'వారిని ఉరి తీయాలి'
వైఎస్ వివేకా హత్యకేసు నిందితులను ఉరి తీయాలని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపైనా కూడా కొందరు ఆరోపణలు చేశారని.. తాను ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నానన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేయాలన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మార్పులివే!
భారత్ స్వేచ్ఛావాయువులు పీల్చుకొని 74 ఏళ్లు గడిచాయి. సగర్వంగా నేడు 75వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రయాణంలో అనేక అనుభవాలు.. ఆటుపోట్లు. అనేక మార్పులు. ఆకలి నుంచి మిగులు ఆహార ధాన్యాల నిల్వల వరకు.. ఆర్థిక సంక్షోభం నుంచి.. ఆర్థిక స్వాతంత్ర్యం వరకు.. ఇలా చాలా విప్లవాత్మక మార్పులు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- నాణేలతో రికార్డు
నాణేల సేకరణపై ఆసక్తి ఉన్న ఓ యువకుడు 2006 నుంచి 2020 మధ్య చలామణీలోకి వచ్చిన 21 రకాల 10 రూపాయల నాణేలను సేకరించాడు. ఇందుకు గాను అతను వరల్డ్ రికార్డ్స్ ఆఫ్ ఇండియాలో స్థానం సంపాదించాడు. వివిధ దేశాలకు చెందిన కాయిన్స్‌ను కూడా ఈ యువకుడు సేకరించాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- అతి త్వరలోనే..!
అతికొద్ది రోజుల్లోనే అఫ్గానిస్థాన్‌లోని కీలక నగరాలను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ఆదివారం రాజధాని కాబుల్‌లోకి ప్రవేశించారు. ప్రభుత్వంతో 'అధికార బదిలీ' అంశాన్ని చర్చించేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఆ దేశ అధ్యక్ష కార్యాలయానికి తాలిబన్ ప్రతినిధులు వెళ్తున్నారని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- భారం తగ్గించుకోండిలా...
కొంత మంది గృహ రుణం, వ్యక్తిగత రుణం సహా ఇతర రుణాలు తీసుకుని ఇబ్బందులు పడుతుంటారు. కరోనా సమయంలో ఈ అవస్థలను ఎక్కువ మంది అనుభవించారు. ఉద్యోగాల్లో కోత, వేతన కోత వల్ల ఇది జరిగింది. ఇలాంటి వారు రుణ భారం తగ్గించుకునేందుకు ఏం చేయవచ్చు? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఆ సౌండ్ ఇంకా వినిపిస్తూనే ఉంది!
28 ఏళ్ల భారత దేశ కల, మూడు ఐసీసీ ట్రోఫీలు, టెస్టుల్లో నెం.1 స్థానం.. సంపాదించి పెట్టిన క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ.. ఆటకు వీడ్కోలు పలికి ఆదివారానికి(ఆగస్టు) ఏడాది పూర్తయింది. దేశంలో క్రికెట్ అభిమానులకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన అతడు.. ఆటకు దూరమై చేదు జ్ఞాపకాన్ని మిగిల్చాడు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మూగబోయిన గొంతుక
గతంలో పలు హిందీ సినిమాల్లో హుషారైన పాటలు పాడి అభిమానుల్ని అలరించిన జగ్జీత్ కౌర్.. తుదిశ్వాస విడిచారు. సినీ ప్రముఖులు, నెటిజన్లు ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.