- కడపలో సీఎం పర్యటన
కడప జిల్లాలో సీఎం జగన్ రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో పులివెందుల, బద్వేలు ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- 'జోక్యం చేసుకోండి'
కృష్ణా నదీ జలాల వినియోగం వివాదాలపై విజయవాడలో అఖిలపక్షం సమావేశమయ్యింది. సీఎం జగన్ ఉత్తరాలు రాస్తున్నారే తప్ప.. రైతులు నష్టపోతున్నారని ఆలోచించటం లేదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నది జలాలను సాధించేందుకు.. కార్యాచరణ ప్రకటిస్తే సీఎం వెనకుండి నడుస్తామని నేతలు తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- దశాబ్దం తర్వాత క్రాప్ హాలీడే
కోనసీమలో దశాబ్ద కాలం తర్వాత మళ్లీ క్రాప్ హాలిడే మాట వినిపిస్తోంది. 2011లో పంట విరామం ప్రకటించిన రైతులు.. ఇప్పుడు కూడా అదే బాటలో నడుస్తున్నారు. డ్రైయిన్‌లు పూడుకపోవడం.. వరుస విపత్తులు, ముంపు బెడదతో పంటలు నష్టపోవడం పరిపాటిగా మారడంతో.. ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- తెలంగాణ హైకోర్టులో విచారణ
కృష్ణానది జలవిద్యుత్ ఉత్పత్తి వివాదంపై తెలంగాణ హైకోర్టు విచారణ ప్రారంభమైంది. ఇరువైపులా న్యాయవాదులు గందరగోళం సృష్టిస్తున్నారని సీజే జస్టిస్ హిమాకోహ్లి అసహనం వ్యక్తం చేశారు. న్యాయమూర్తులకు ఉద్దేశాలు ఆపాదించడం తగదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- ఎల్లుండి ముహూర్తం.. !
కొన్ని రోజులుగా సర్వత్రా చర్చనీయాంశమైన కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 8న కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఇందులో 22 మంది వరకు కొత్తవారికి అవకాశం దక్కనున్నట్టు సమాచారం. అదే సమయంలో పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు కూడా జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కొత్త గవర్నర్లు
కేంద్ర కేబినెట్ పునర్విభజన వార్తల నేపథ్యంలో కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించటం సహా మరికొన్ని రాష్ట్రాల గవర్నర్లను బదిలీ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- విమానం మిస్సింగ్
రష్యాలోని ఓ ప్రయాణికుల విమానం గల్లంతైంది. ఫార్ ఈస్ట్ ప్రాంతంలో పెట్రోపవ్లోస్క్- కామ్‌చట్‌స్కీ నుంచి పలానా వెళ్తున్న ఓ విమానంతో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సంబంధాలు తెగిపోయాయి. షెడ్యూల్ ప్రకారం ల్యాండింగ్ కూడా జరగలేదు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కొత్త ఫోన్- ఫీచర్లు ఇవే
బడ్జెట్ ధరలో అదిరే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది శాంసంగ్. గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లో భాగంగా ఎఫ్22 (Samsung Galaxy F22) పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త మోడల్ ధర, ఫీచర్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- కరోనా కలవలం
ఇంగ్లాండ్ వన్డే జట్టులోని ఏడుగురు సభ్యులకు కరోనా నిర్దరణ అయింది. ఈ నేపథ్యంలో గురువారం పాకిస్థాన్‌తో జరగనున్న వన్డే సిరీస్ కోసం ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు మరో జట్టును ప్రకటించనుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.
- మూవీ మిక్చర్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో మిషన్ ఇంపాజిబుల్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, మాలిక్, డెవిల్ చిత్రాల సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.