ETV Bharat / city

అంతుచిక్కని వింత వ్యాధి..ఏలూరులో కొనసాగుతున్న పరిశోధనలు

ఏలూరు వింత వ్యాధి అంతు చిక్కటం లేదు. వారం రోజులు అవుతున్నా...వ్యాధి కారణాలు మాత్రం ఇప్పటికీ నిర్ధరణ కాలేదు. వింత వ్యాధితో ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య తగ్గుముఖం పట్టినా..వ్యాధి కారకాలు మాత్రం తేలలేదు. పలు జాతీయ పరిశోధన సంస్థల బృందాలు నాలుగు రోజులుగా ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తున్నాయి. బాధితుల రక్తంలో భార లోహాలైన సీసం, నికెల్ అవశేషాలను గుర్తించారు. కూరగాయలు, పాలు, తాగునీటిలో ఆర్గనో క్లోరిన్స్ వంటివి ఉన్నాయన్నారు. క్షేత్రస్థాయిలో నిపుణుల బృందం పరిశోధనలు సాగిస్తోంది.

అంతుచిక్కన వింత వ్యాధి
అంతుచిక్కన వింత వ్యాధి
author img

By

Published : Dec 11, 2020, 4:21 PM IST

ఏలూరు వింతవ్యాధికి సంబంధించి వివిధ విభాగాలకు చెందిన జాతీయ నిపుణులు ముమ్మరంగా పరిశోధనలు సాగిస్తున్నారు. తాగునీరు, ఆహార పదార్థాలు, పాలు, వాతావరణం వంటి వాటిపై పరిశోధనలు చేస్తున్నారు. బాధితుల రక్త నమూనాల్లో భార లోహలైన సీసం, నికెల్ బయటపడటంతో ఏలూరు పరిసరాల్లో పరిశ్రమలను తనిఖీ చేశారు. కూరగాయలు, తాగునీటిలో ఆర్గనో క్లోరిన్స్ వెలుగు చూడటంతో పరిసరాల్లోని పురుగుమందుల దుకాణాల్లోనూ తనిఖీలు చేస్తున్నారు.

నాలుగు రోజులుగా వివిధ జాతీయ సంస్థలు ఈ పరిశోధనల్లో పాల్గొంటున్నాయి. దిల్లీ ఎయిమ్స్, ఎన్ఐఎన్, ఎన్ఐవీ, ఐఐసీటీ, ఎన్సీడీసీ జాతీయ సంస్థలు....స్థానిక వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులతో మాట్లాడారు. ఆహారం, తాగునీరే ఈ వింత వ్యాధికి కారణమైనట్లు ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. ఆహారం, తాగునీటిలోకి భారలోహాలు, ఆర్గనో క్లోరిన్స్, క్రిమిసంహారక మందులు ఎలా చేరాయన్నదానిపై విస్తృతంగా పరిశీలిస్తున్నారు. ఈ రోజు పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందించే వీలుందని అధికారులు అంటున్నారు. ఏలూరు నగరంలో పత్తేబాద, అశోక్ నగర్, పంపులచెరువు ప్రాంతాల్లో 2 వందలకు పైగా నీటి నమూనాలు సేకరించి.. హైదరాబాద్​లోని ప్రయోగశాలలకు పంపించారు. వ్యాధిని నిర్ధరించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కమిటీని నియమించింది.

ఎందుకు ఏలూరు ప్రజలు వ్యాధి బారిన పడ్డారానే విషయంపై పరిశోధనలు జరుగుతున్నాయి. పరిశోధనల్లో కేంద్ర, రాష్ట్ర బృందాలు పాలుపంచుకుంటున్నాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కేసుల సంఖ్య ఈరోజు తగ్గింది. -ఆళ్లనాని, వైద్య ఆరోగ్యశాఖమంత్రి

ఉదయం ఉన్నట్లుండి కిందపడిపోయి సృహ కోల్పోయాను. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఫిట్స్ వ్చచింది. ఆసుపత్రికి రాగానే చికిత్స అందించారు. ఇప్పుడు బాగానే ఉంది. కానీ...మాకు ఇలా ఎందుకు జరిగిందో తెలియటం లేదు. భయాందోళనకు గురవుతున్నాం. ప్రభుత్వం స్పందించి ఈ వింత వ్యాధి సమస్యకు పరిష్కారం త్వరగా చూపాలి.

- దీపిక, వింతవ్యాధి బాధితురాలు

వింత వ్యాధి వ్యాప్తి కారణాలపై ప్రజల్లో భయాందోళన నెలకొంది. కారణాలు తెలిస్తే.. కొంతవరకు జాగ్రత్తలు తీసుకొనే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.

ఇదీచదవండి

ఏలూరులో వింత వ్యాధి తగ్గుముఖం.. రాత్రి నుంచి ఒకే ఒక్క కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.