ETV Bharat / city

కొవిడ్ చికిత్సకు ప్రైవేట్​ దందా...లక్షల్లో బిల్లులు వసూలు - కోవిడ్ బాధితులకు లక్షల్లో బిల్లులు వేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులు

కరోనా కాటుకు ఆరోగ్యంతో పాటు ఆస్తులు ఆవిరి అవుతున్నాయి. కొవిడ్ చికిత్స కోసం ప్రైవేట్​ ఆసుపత్రిని ఆశ్రయించిన బాధితులకు బిల్లు చూస్తే... కరోనానే కాస్త నయం బాధించి వదిలేసింది...వీళ్లు ఉన్నది అమ్ముకున్నా వదిలేలాలేరు అనిపిస్తుంది. కొవిడ్ మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో ప్రైవేటు ఆసుపత్రులు బాధితుల్ని పీల్చిపిప్పి చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి... లక్షల్లో బిల్లులు వసూలు చేస్తున్నాయి.

కొవిడ్ చికిత్సకు ప్రైవేట్​ దందా...లక్షల్లో బిల్లులు వసూలు

author img

By

Published : Oct 8, 2020, 11:23 PM IST

పశ్చిమగోదావరి జిల్లాలో ఐదు నెలలుగా కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. సగటున రోజువారి వేయికి పైగా కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. మరణాల శాతం కూడా జిల్లాలో అధికంగా ఉంది. కరోనా బారిన పడిన ప్రజలు అధికమంది తీవ్రస్థాయిలో అనారోగ్యానికి గురవుతున్నారు. 20 శాతం మందికి రోజువారి ఆక్సిజన్ అవసరం అవుతోంది. ఈ కారణంగా కొవిడ్ బాధితులు కొందరు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరైతే.. గుట్టుచప్పుడు కాకుండా ఉంటుందని పరీక్షల నుంచి చికిత్స వరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చేయించుకుంటున్నారు. ఇదే అదునుగా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు భారీగా దోపిడికి పాల్పడుతున్నాయి.

కొవిడ్​ పరీక్షకే రూ. ఐదు వేలు

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరీక్షలు ఆలస్యం అవుతున్నాయని మరో కారణంతో.. బాధితులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో కొవిడ్ పరీక్షల కోసం ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. సిటీ స్కానింగ్ కోసం నాలుగు వేల రూపాయలు తీసుకుంటున్నారు. కొవిడ్ వైద్యం చేస్తున్న కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు ఫీజులు వసూలు చేయడంలేదు. నాలుగింతలు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కొవిడ్ బాధితులు ప్రైవేటు ఆస్పత్రిలోకి ప్రవేశిస్తేనే లక్ష రూపాయలు ముందుస్తుగా చెల్లించాల్సి ఉంటుంది. రోజుకు 30 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఆక్సిజన్, వెంటిలేటర్ చికిత్స అయితే ఫీజు లక్షలాది రూపాయలకు చేరుకుంటోంది. ఏలూరు, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం,నరసాపురం, నిడదవోలు తదితర పట్టణ ప్రాంతాల్లో ప్రైవేటు ఆస్పత్రులు స్థాయికి తగ్గట్టుగా ఫీజులు వసూలు చేస్తున్నారు..

ఫీజులు కొండంత

సాధారణంగా ఆస్పత్రిలో ఉంచితే.. రోజుకు రూ.3200, ఆక్సిజన్ అందిస్తే.. రూ.5400, వెంటిలేటర్​పై ఉంచితే.. రూ.10,800 ఫీజులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ సాధారణ చికిత్స కోసం రూ.20వేలు, ఆక్సిజన్ అందిస్తే.. రూ.32 వేలు, వెంటిలేటర్​పై ఉంచితే.. రూ.45 వేలు వసూలు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల్లో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఏలూరులో ఒక కార్పొరేట్ ఆస్పత్రిలో లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని రుజువు కావడంతో ఆస్పత్రిని మూడు నెలలపాటు సీజ్ చేశారు. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిపైనా చర్యలు తీసుకున్నారు.

జిల్లాలో 73 వేల మందికి పైగా కరోనా బాధితులు

పశ్చిమ గోదావరి జిల్లాలో జులై నెల నుంచి కరోనా కేసుల సంఖ్య తీవ్రస్థాయిలో నమోదు అవుతున్నాయి. ఏలూరు, భీమవరం, నరసాపురం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో కేసులు వస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. జిల్లాలో మాత్రం తగ్గడంలేదు. జిల్లాలో 73 వేల మంది కరోనా బారినపడగా.. ఇందులో 65 వేల మంది కోలుకున్నారు. ఎనిమిది వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సుమారు ఐదు వందల మందికి పైగా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లోనే కాకుండా.. విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ చికిత్స తీసుకుంటున్నారు. సాధారణంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో మూడు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు కొవిడ్​ చికిత్సకు ఖర్చవుతోందని బాధితులు అంటున్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై నిఘా పెట్టామని.. తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్​వో సునంద వివరణ ఇచ్చారు.

కరోనాను సాకుగా చూపి... లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి అణగారిన వర్గాల గొంతుక పాసవాన్ : సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.