పశ్చిమగోదావరి జిల్లా పురపోరులో వైకాపా సత్తా చాటింది. జంగారెడ్డిగూడెం, నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు మున్సిపాలిటీల్లో విజయదుందుభి మోగించింది.
- నరసాపురం పురపాలికలో 31వార్డులు ఉండగా..మూడు వార్డులు వైకాపా ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 28 వార్డులకు ఎన్నికలు జరగగా...22 వైకాపా, 3 తెదేపా, 1 జనసేన, 2 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
- నిడదవోలు మున్సిపాలిటీలో 28 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా...27 వార్డుల్లోనూ వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. తెదేపా ఒక స్థానంతో సరిపెట్టుకుంది.
- కొవ్వూరు మున్సిపాలిటీలో 23 వార్డులు ఉండగా..గతంలోనే 13 ఏకగ్రీవమయ్యాయి. అందులో వైకాపా 9, తెదేపా 4 వార్డులను ఏకగ్రీవం చేసుకొన్నాయి. మిగిలిన 10 వార్డులకు ఎన్నికలు జరగగా..వైకాపా 6, తెదేపా 3, భాజపా 1 వార్డులో విజయం సాధించాయి. ఏకగ్రీవాలతో కలుపుకొంటే..వైకాపా 15, తెదేపా 7 వార్డులను కైవసం చేసుకున్నాయి.
- జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో 29 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా...25 వార్డుల్లో వైకాపా, 3 వార్డుల్లో తెదేపా, 1 వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు కార్పొరేషన్లో ఎన్నికలు జరిగినా...ఓట్ల లెక్కింపు వాయిదా వేశారు. ఈ నెల 23న ఓట్ల లెక్కింపును ఎప్పుడు నిర్వహించాలన్నది తేలనుంది.
ఇదీచదవండి