ఇంటి అద్దెలతో ఇబ్బందిపడుతున్న ప్రతి పేదవారికి సొంతింటిని అందించటమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఆళ్ల నాని అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు పరిసరాల్లో పేదల పంపిణీకి సిద్ధం చేసిన ఇంటి స్థలాలను ఆయన పరిశీలించారు. ఈనెల 25న పెద్ద ఎత్తున ఇంటి స్థలాల పంపిణీ ఉంటుందని చెప్పారు. ఏలూరు నగరంలో దాదాపు 30 వేల మందికి లబ్ధి చేకూర్చేలా ఇంటి స్థలాలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పేదల సొంతింటి కల త్వరలోనే నెరవేరబోతుందని తెలిపారు.
ఇదీ చదవండి
సుప్రీం స్టే ఇస్తేనే.. 'రాజ్యాంగ విచ్ఛిన్నం'పై విచారణ ఆపుతాం: హైకోర్టు