ప్రమాదవశాత్తు రైలు ఢీకొట్టినా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. తణుకు-మండపాక గ్రామాల మధ్య రైలు పట్టాలపై వ్యక్తి మద్యం మత్తులో నడుచుకుంటూ వెళ్తుండగా తణుకు రైల్వే స్టేషన్ నుంచి అప్పుడే బయల్దేరిన సర్కార్ ఎక్స్ప్రెస్ వెనకనుంచి వచ్చి ఢీ కొట్టింది. ట్రైన్ వేగం తక్కువ ఉండటంతో అతనికి ప్రాణాపాయం తప్పింది.
వ్యక్తిని ఢీ కొట్టిన విషయం గమనించిన రైలు డ్రైవర్ అప్రమత్తమై వెంటనే రైలును ఆపేశాడు. రైలు బండి కింద పట్టాల మీద పడి ఉన్న వ్యక్తిని స్థానికుల సహకారంతో బయటికి తీశారు. స్వల్ప గాయాలైన బాధితుడిని బంధువులు ఆస్పత్రికి తరలించారు. అప్రమత్తంగా వ్యవహరించి వ్యక్తి ప్రాణాలు కాపాడిన రైలు డ్రైవర్ను పలువురు అభినందించారు.
ఇదీ చదవండి: