ETV Bharat / city

ఉప్పు ప్రక్షాళనకు..తొలి అడుగు - krishna district newsupdates

ఉప్పునీటి సమస్యతో విలవిల్లాడుతున్న కొల్లేరు సరస్సుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మంచి రోజులు రాబోతున్నాయి. కొన్నేళ్లుగా జిల్లాలో పేరుకుపోతున్న ఉప్పు ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు భారీగా నిధుల మంజూరుకు సమాయత్తమవుతోంది. కృష్ణా, గోదావరి నదుల మధ్యలో ఉంటూ అంతులేని వరద ప్రవాహాన్ని సముద్రంలో కలుపుతున్న కొల్లేరు ఉప్పునీటి సరస్సుగా రూపాంతరం చెందుతోంది. కైకలూరు, గుడివాడ, పెడన, బందరు, అవనిగడ్డ నియోజకర్గాలు ఉప్పునీటి రొయ్యల సాగుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

first step to salt cleansing
ఉప్పు ప్రక్షాళనకు..తొలి అడుగు
author img

By

Published : Dec 8, 2020, 1:24 PM IST

ఉప్పునీటి సమస్యతో విలవిల్లాడుతున్న కొల్లేరు సరస్సుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు మంచి రోజులు రాబోతున్నాయి. కొన్నేళ్లుగా జిల్లాలో పేరుకుపోతున్న ఉప్పు ప్రక్షాళనకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటుతో పాటు భారీగా నిధుల మంజూరుకు సమాయత్తమవుతోంది. కృష్ణా, గోదావరి నదుల మధ్యలో ఉంటూ అంతులేని వరద ప్రవాహాన్ని సముద్రంలో కలుపుతున్న కొల్లేరు ఉప్పునీటి సరస్సుగా రూపాంతరం చెందుతోంది. కైకలూరు, గుడివాడ, పెడన, బందరు, అవనిగడ్డ నియోజకర్గాలు ఉప్పునీటి రొయ్యల సాగుతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. సారవంతమైన వ్యవసాయ భూములు చౌడుబారిపోతున్నాయి. నీటి వనరులన్నీ కలుషితమై మంచినీటి లభ్యత తరిగిపోతోంది. ప్రభుత్వ తాజా ప్రకటనతో కొల్లేరు మత్స్యకారులతో పాటు వ్యవసాయదార్లకు మంచిరోజులు వస్తాయని భావిస్తున్నారు.

వనామీ సాగే కారణం

కృష్ణా జిల్లా తలసరి ఆదాయాన్ని పెంచడంలో ముఖ్య భూమిక పోషిస్తున్న వనామీ రొయ్యల సాగుతోనే ఉప్పు పొరలు పేరుకుపోతున్నాయి. 2009 నుంచి జిల్లాలో వనామీ సాగు మొదలైంది. ప్రస్తుతం 65 వేల ఎకరాల్లో రొయ్యలను సాగుచేస్తున్నారు. దీనికి అవసరమైన ఉప్పునీటి కోసం విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు. జిల్లాలో సాధారణంగా లభించే 0.5 పీపీటీ ఉప్పు నీటితోనే రొయ్యలు సాగు చేయాలి. ఈ నిబంధన ఎక్కడా అమలవడం లేదు. 5 పీపీటీ నుంచి 15 పీపీటీ ఉన్న నీటితో సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కైకలూరు, గుడివాడ, కొల్లేరు పరివాహక ప్రాంతంలో భారీ ఎత్తున ఉప్పునీరు సరస్సులోకి వచ్చి చేరుతోంది. రొయ్యల సాగులో వాడే అధిక గాఢత ఉన్న రసాయన మందులతో కలుషితమైన నీటిని శుద్ధి చేయకుండా నేరుగా కొల్లేరులోకి విడుస్తున్నారు. గతంలో కొట్టేసిన చెరువుల్లో టన్నుల కొద్ది ఉప్పును చల్లి రొయ్యల సాగు చేస్తున్నారు. ఒక పక్క ఉప్పునీరు, మరోపక్క విచ్చలవిడిగా వాడిన రసాయన వ్యర్థాలతో సారవంతమైన నేలలు చౌడుబారిపోతున్నాయి. సమీప గ్రామాల్లో తాగు, వాడుక నీరు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కార్పొరేషన్‌ ఏర్పాటుకు నిర్ణయం

జిల్లాలోని ఉప్పు ప్రభావిత ప్రాంతాలతో పాటు కొల్లేరు సరస్సును పరిరక్షించడానికి ప్రభుత్వం చేపట్టనున్న ప్రాజెక్టుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు పేరుకుపోయిన ఉప్పును దిగువకు పంపేందుకు జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చర్యలు చేపట్టనున్నారు. ఇందుకోసం రూ.2952 కోట్లను సమకూర్చుతున్నట్లు అధికారులు వెల్లడించారు. నిధులు సక్రమంగా వెచ్చించేందుకు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఛైర్మన్‌, బోర్డును నియమించనున్నారు. అవసరమైతే మరో ఐదు ప్రాజెక్టులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు వివరిస్తున్నారు. చిత్తశుద్ధితో ఈ ప్రాజెక్టులను అమలుచేస్తే కొల్లేరుకు పూర్వవైభవం సాధ్యపడుతుంది.

తగ్గుతున్న దిగుబడులు

జిల్లాలో ఏటికేడు పెరుగుతున్న ఉప్పునీటి రొయ్యల సాగుతో సారవంతమైన భూములు చౌడుబారి దిగుబడులపై ప్రభావాన్ని చూపుతున్నాయి. రొయ్యల చెరువుల్లోని సీపేజ్‌ వాటర్‌ వల్ల పక్కనే ఉన్న పొలాలు ఎండిపోతున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థలు లేకపోవడంతో పంట కాలువల్లోకి కలుషిత నీటిని విడుదల చేస్తున్నారు. ఆ నీటిని పొలాలకు వాడుతున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా శివారున ఉన్న కైకలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి, నందివాడ, గుడివాడ, బంటుమిల్లి ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. జిల్లాలో ఉప్పు మండలాలుగా ఉన్న కైకలూరు, గుడివాడ, బందరు, పెడన, అవనిగడ్డ నియోజకవర్గాల్లో సుమారు లక్ష ఎకరాల వరకు పంటపై ప్రభావం కనిపిస్తోంది.

ప్రత్యేక ప్రాజెక్టుతో ప్రయోజనం

జిల్లాలో ఉప్పునీటి నివారణకు ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రాజెక్టుతో ఎంతో ప్రయోజనం ఉంటుంది. విడతల వారీగా ప్రక్షాళనకు ప్రత్యేక చర్యలు పాటిస్తాం. విధివిధానాలు తెలియరావాల్సి ఉంది. కార్పొరేషన్‌ ఏర్పాటు, ఇతర ప్రాజెక్టుల ద్వారా కొల్లేరులో మంచినీటి వనరులను పెంపొందించేదిశగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.- గణపతి, ఇరిగేషన్‌ డీఈ, కైకలూరు

ఇదీ చదవండి:

మద్యానికి బానిసై..షేవింగ్‌ లోషన్‌ తాగి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.