ETV Bharat / city

వింత వ్యాధి: 'ఆరోగ్య శ్రీ' లోకి చేర్చుతూ ప్రభుత్వ ఉత్తర్వులు - ఆరోగ్య శ్రీలోకి ఏలూరు వింత మూర్చ వ్యాధి వార్తలు

ఏలూరులో వ్యాపించిన వింత వ్యాధి కారణాలు స్పష్టంగా తెలియరావడం లేదు. ఐదు రోజులు గడుస్తున్నా పూర్తి వివరాలు వెల్లడి కాకపోవటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. అయితే వారికి ఆసరా కల్పించేందుకు వింత వ్యాధిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.

వింత వ్యాధి: 'ఆరోగ్య శ్రీ' లోకి చేర్చుతూ ప్రభుత్వ ఉత్తర్వులు

author img

By

Published : Dec 8, 2020, 10:36 PM IST

ఏలూరులో వింత వ్యాధితో ప్రజలు భయంభయంగా గడుపుతున్నారు. ఆ వ్యాధిని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తూ.. ప్రభుత్వ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రకాల చికిత్సలకు ప్యాకేజీలను నిర్దేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. మూర్ఛ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడానికి మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని.. ప్రస్తుతం ఉన్న ప్యాకేజ్ 10,000 రూపాయల నుంచి 15, 688 రూపాయల వరకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి ఆళ్ల నాని చెప్పారు.

మూడు నుంచి ఐదు రోజులకు

మూర్ఛ వ్యాధిగ్రస్తులకు 8 రకాల రక్త పరీక్షలను కూడా ఈ ప్యాకేజీలో కలిపినట్టు మంత్రి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నెట్​వర్క్​ ఆసుపత్రులలో వైద్యచికిత్స పొందుతున్న వారికి ప్రస్తుత కాలపరిమితిని మూడు రోజుల నుంచి ఐదు రోజుల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఇస్తున్న 12,000 రూపాయల నుంచి 18,908 రూపాయల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని ఐదు రకాల రక్త పరీక్షలను కూడా ఈ ప్యాకేజీలో చేర్చామని ఆళ్ల నాని తెలిపారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న చిన్న పిల్లలకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీ 10,262 రూపాయల నుంచి 12,732 రూపాయల వరకు ప్యాకేజీ మొత్తాన్ని పెంచినట్టు వెల్లడించారు. అన్ని నెట్వర్క్ ఆసుపత్రులలో ఐదురోజులకు మించి చికిత్స పొందే మూర్ఛ వ్యాధిగ్రస్తులకు రోజుకు 900 రూపాయలు, ఐసీయూలో చికిత్స పొందుతున్న వ్యాధిగ్రస్తులకు 2000 రూపాయలు ప్యాకేజీని కొత్తగా చేర్చడం జరిగిందని తెలిపారు.

వ్యాధి తగ్గుముఖం!

మరోవైపు ప్రాథమికస్థాయిలో రోగుల రక్తంలో పరిమితికి మించి నికెల్, సీసం లాంటి భారలోహాలు ఉన్నట్టు గుర్తించినప్పటికీ .. మరింత లోతైన విశ్లేషణ కోసం దిల్లీలోని ఎయిమ్స్​కు రక్త నమూనాల్ని ప్రభుత్వం పంపించింది. ఈ రోగం గుట్టు కనుగొనేందుకు జాతీయ స్థాయిలోని పరిశోధనా సంస్థల బృందాలు ఏలూరులోని వివిధ ప్రాంతాకు వెళ్లి నమూనాలు సేకరించటంతో పాటు స్థానికంగా ఉన్న పారిశుధ్య పరిస్థితిని కూడా అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ వింత వ్యాధి క్రమేణా తగ్గుముఖం పడుతోందని ప్రభుత్వ వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

పురపాలక శాఖ నీటిని తాగొద్దు

ప్రస్తుతం ఏలూరు నగరంలో నెలకొన్న పరిస్థితులను తగ్గిచేందుకు ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం.. పురపాలక శాఖ సరఫరా చేస్తున్న పంపునీటిని తాగవద్దని స్థానికులకు సూచనలు జారీ చేసింది. కూరగాయలను కూడా ఉప్పునీటిలో కడిగిన అనంతరమే వినియోగించాల్సిందిగా హెచ్చరికలు ఇచ్చారు. మరోవైపు స్థానికంగా వినియోగిస్తున్న పాలు, కూరగాయలు, ఆహారపదార్థాలను, నీటిని మరోమారు పరీక్షలు చేయించాలని నిర్ణయించామని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రభుత్వాసుపత్రిలో సరిపడినన్ని పడకలు, మందులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది.

పురుగు మందుల అవశేషాలు

వింత మూర్చ వ్యాధి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 561కి పెరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 81గా ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఆస్పత్రి నుంచి ఇప్పటి వరకూ 450 మంది డిశ్ఛార్జి అయ్యారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆస్పత్రులకు 29 మంది రోగులను తరలించారు. ఇ-కొలి లాంటి బ్యాక్టీరియాల పరిశీలనకు 22 నీటి నమూనాల సేకరించారు. ఇందులో పురుగుమందుల అవశేషాలున్నట్టు గుర్తించారు. సేకరించిన 62 రక్త నమూనాల్లో 10 నమూనాల్లో పరిమితికి మించి నికెల్ , సీసం ఉన్నట్టుగా తేలింది. మరో 40 నమూనాలను దిల్లీలోని ఎయిమ్స్​కు పంపించారు. వెన్నెముక నుంచి తీసిన నమూనాల ద్వారా చేసిన కల్చర్ టెస్టుల్లోనూ వైరస్, బ్యాక్టీరియా ఆనవాళ్లు లేవని ప్రభుత్వం తెలిపింది. కణజాల పరీక్ష కోసం సీసీఎంబీకి పంపిన 10 నమూనాల తాలూకు ఫలితాలు రావాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఏలూరు ఘటనపై పూర్తి స్థాయిలో పరిశోధించండి: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.