చెరకు రైతుల నుంచి లంచాలు వసూలు చేసిన.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లోకనాథ ప్రసాద్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలో వివిధ గ్రామాలకు చెందిన చెరకు రవాణా వాహనదారుల నుంచి.. రవాణాశాఖ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు మంత్రి పేర్ని నానికి.. రైతులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. చెరకును పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం త్రాడువాయి ఆంధ్ర షుగర్స్ ఫ్యాక్టరీకి ట్రాక్టర్ల ద్వారా రవాణా చేస్తామని, మార్గమధ్యలో కలపర్రు టోల్ గేట్ వద్ద ఆర్టీవో అధికారులు ఒక్కొక్క ట్రాక్టర్‌కు.. రూ.500 చొప్పున వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏవో కారణాలు చూపుతూ బలవంతంగా నగదు వసూలు చేస్తున్నారని, చెల్లించకపోతే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని.. రైతులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్నినాని ఉన్నతాధికారులను ఆదేశించారు. విచారణ జరిపిన అధికారులు.. లోకనాథ ప్రసాద్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: