ETV Bharat / city

కరోనాపై పాట... అదనపు ఎస్పీ నోట!

కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కంటికి కన్పించని ఈ సూక్ష్మజీవి పేరు చెబితే అగ్రదేశాల నుంచి చిన్న దీవుల వరకూ వణికిపోతున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ వైరస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకురాడానికి ఎంతో మంది ముందుకు వస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో పోలీసులూ భాగమవుతున్నారు.

corona awareness song by ap police officer saritha
కరోనాపై పాట పాడిన అడిషనల్ ఎస్పీ సరిత
author img

By

Published : Apr 14, 2020, 11:29 AM IST

కరోనాపై పాట పాడిన అడిషనల్ ఎస్పీ సరిత

కరోనాపై అవగాహన కల్పించేందుకు పోలీసులు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఉన్నతాధికారిణి స్వయంగా పాట పాడి.. వ్యక్తిగత దూరం ఆవశ్యకతను వివరించారు. మహిళా రక్షణ విభాగంలో అడిషనల్‌ ఎస్పీ, సీఐడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కేజీవీ సరిత.. స్వయంగా పాట పాడి ప్రజలను ఆలోచింపజేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో పోలీసుల కృషిని వివరించారు.

యువత అనవసరంగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఆమె పాట ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలను పణంగా పెడుతున్నామని.. ప్రజలు బయటకు వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు. ప్రస్తుత లాక్‌డౌన్‌ వేళ ప్రజలంతా తమ కుటుంబసభ్యులతో గడుపుతుంటే.. తాము మాత్రం కంటికి నిద్ర లేకుండా రోడ్లపై విధులు నిర్వహిస్తున్నామంటూ వాస్తవ పరిస్థితులను ఇలా పాట రూపంలో వివరించారు.

ఇదీ చదవండి:

కళ్లను తెరిపించే 'కరోనా' చిత్రాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.