కరోనా విజృంభిస్తున్న వేళ ఏలూరులో లాక్ డౌన్ విధించారు. ఉదయం నుంచే అన్ని దుకాణాలు మూసివేశారు. హోల్ సేల్ దుకాణాలు మూతపడగా ఒక్కసారిగా నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఒకటో పట్టణ పరిధిలోనే చేపలు, మాంసం, కూరగాయాల మార్కెట్లు ఉన్నాయి. నగరంలోని అన్ని ప్రాంతాల చిరువ్యాపారులు... ఇక్కడే నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం చిరువ్యాపారులు తాడేపల్లిగూడెం, విజయవాడకు వెళ్లి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో ధరలు పెరిగాయని ప్రజలు అంటున్నారు.
ఇది చదవండి అనర్హులకు ఇళ్లస్థలాలు కేటాయించారని గ్రామస్థుల ఆందోళన